బంధుప్రీతి అన్నారు.. కానీ అర్జున్ నిరూపించుకున్నాడు : ప్రీతి జింటా

praveen
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి తుది జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న.. అర్జున్ టెండూల్కర్ కు ఇక 2023లో చివరికి ఛాన్స్ దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు అర్జున్ టెండూల్కర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

 కేవలం సచిన్ వారసుడు అన్నమాటే కానీ అర్జున్ టెండూల్కర్ లో అసలు టాలెంట్ లేదని. సచిన్ మీద ఉన్న గౌరవంతోనే ముంబై ఇండియన్స్ అతని కొనుగోలు చేసి జట్టులో పెట్టుకుంది అంటూ విమర్శలు చేశారు. ఇలా ముంబై ఇండియన్స్ అర్జున్ విషయంలో బంధుప్రీతి చూపించింది అంటూ ఎంతోమంది విమర్శలు చేయడం సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు అర్జున్ ప్రతిభ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జంట స్పందించారు.

 ఇటీవల జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ చేశాడు. అంతేకాదు ఐపీఎల్ కెరియర్ లో తొలి వికెట్ కూడా తీసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ప్రీతి జింటా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. అర్జును ను చాలామంది బంధుప్రీతి అని ఎగతాళి చేశారు. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో తానేంటో నిరూపించుకున్నాడు. ఈ విషయంలో నిజంగా సచిన్ టెండూల్కర్ గర్వపడాలి అంటూ ప్రీతి జింటా వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటివాళ్ళు అర్జున్ ప్రతిభ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు వరకు అయితే రెండు మ్యాచ్లలో తన పర్ఫామెన్స్ తో పర్వాలేదు అనిపించిన అర్జున్ తర్వాత మ్యాచ్ లలో ఎలా రానించబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: