4 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం.. కోర్టు ఏం శిక్ష వేసిందంటే?

praveen
ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా ఆడ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గు ముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. సాటి మనుషుల విషయం లో మానవత్వం తో జాలీ దయ చూపించాల్సిన మనుషులు ఆడపిల్ల కనిపిస్తే చాలు మానవ మృగాలుగా మారిపోతున్నారు అని చెప్పాలి. వెరసి ఇక ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.

 చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు. మంచి వాళ్ళ ముసుగులో నాటకం ఆడుతూ  సమయం సందర్భం వచ్చినప్పుడు అసలు రూపాన్ని బయట పెడుతూ చివరికి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటనలు అటు ఆడపిల్లల భద్రతను రోజురోజుకీ ప్రశ్నార్థకంగా  మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో ఇలా ఆడపిల్లలపై అత్యాచారులకు పాల్పడిన వారికి అటు కోర్టులు దారుణమైన శిక్షలు విధిస్తూ ఉండడం గమనర్హం. ఇక్కడ ఓ అత్యాచార నిందితునికి కోర్టు కఠిన శిక్షణ విధించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో 2021 లో 4 ఏళ్ళ చిన్నారి అత్యాచారం కేసులో నిండితుడు ఒడిశాకు చెందిన అభిరామ్ దాస్ కు ఇటీవల కోర్టు శిక్ష విధించింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచగా..  యావజ్జీవ కారాగార శిక్షతో పాటు అతనికి 5000 రూపాయల జరిమానా విధించిందని.. ఇక కుటుంబ సభ్యులు జరిమానా మొత్తాన్ని చెల్లించాలి అంటూ కోర్టు పేర్కొంది అన్న విషయాన్ని డిసిపి జానకి తెలిపారు. కాగా నిందితుడికి సరైన శిక్ష పడింది అంటూ కోర్టు నిర్ణయం పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: