చెన్నై యాజమాన్యం.. అతనికి ప్రత్యామ్నాయం కనుక్కోవాలి : రవిశాస్త్రి

praveen
ఐపీఎల్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ బౌలర్గా పేరు సంపాదించుకున్నాడు దీపక్ చాహర్. ఇక ఆ తర్వాత తన బౌలింగ్ ప్రతిభతో  టీమ్ ఇండియా సెలెక్టర్ల చూపును కూడా ఆకర్షించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలోకి కూడా వచ్చాడు. అయితే ఇలా వరుసగా అవకాశాలు అయితే అందుకున్నాడు. కానీ తన ఫిట్నెస్ను కాపాడుకోవడం విషయంలో మాత్రం దీపక్ చాహార్ విఫలం అయ్యాడు అని చెప్పాలి. గత కొన్ని నెలల నుంచి వరుసగా గాయాల బారిన పడుతూ ఒకవైపు టీమ్ ఇండియాకు మరోవైపు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.

 గతంలో దీపక్ చాహర్ లాంటి బౌలర్ ఇక గాయం కారణంగా అందుబాటులో లేక కీలకమైన టోర్ని  సమయంలో టీమిండియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇక చెన్నై సూపర్ కింగ్స్  కి సైతం ఇక ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాడు. గత 18 నెలల నుంచి కూడా వరుసగా గాయాల బారిన పడుతూనే ఉన్నాడు దీపక్ చాహర్ పై మాజీ హెడ్  కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు అని చెప్పాలి.

 గత 18 నెలల నుంచి దీపక్ చాహర్ గాయాల బారిన పడుతున్నాడని మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం త్వరలో దీపక్ చాహార్ కి ప్రత్యామ్నాయం కనుగొనాలి అంటూ సూచించాడు. అతని స్థానంలో కొత్త ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలి అంటూ అభిప్రాయపడ్డాడు రవి శాస్త్రి. కాగా గతవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ వేస్తున్న సమయంలో పాత గాయం తిరగబెట్టడంతో.. మళ్ళీ ఇక అతను జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. కాగా అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk

సంబంధిత వార్తలు: