గవాస్కర్ ముందే చెప్పాడు.. కానీ ధోని వినలేదు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్లలో ఘనవిజయాని అందుకుంటే.. మరో రెండు మ్యాచ్లలో మాత్రం ఓడిపోయింది. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠ గా సాగిన పోరులో ఇక మూడు పరుగుల తేడాతో చెన్నై ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే చివర్లో మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ చేస్తుండడంతో తప్పకుండా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో ఇక చెన్నై జట్టుకు ఓటమి తప్పలేదు అని చెప్పాలి. ఇక చివర్లో ధోని వచ్చి తన బ్యాటింగ్లో మెరుపులు మెరూపించినప్పటికీ ఇక గెలిచే అవకాశం మాత్రం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు వచ్చే విధంగా కాకుండా కాస్త ముందుగా బ్యాటింగ్ వస్తే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే మ్యాచ్ కి ముందు కూడా సునీల్ గవాస్కర్  ఇదే చెప్పాడు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ చెప్పినట్లు చేసి ఉంటే గెలిచే వాళ్ళం కదా అని మ్యాచ్ తర్వాత అభిమానులు భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇంతకీ మ్యాచ్ కి ముందు సునీల్ గవాస్కర్ ఏం చెప్పాడంటే.. ఎంఎస్ ధోని తన బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడని ఆశిస్తున్నా. మరో రెండు మూడు ఓవర్లు అదనంగా ఆడగలిగితే జట్టుకు ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో భారీ పరుగులు రాబట్టగలడు ధోని అని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. అయితే ఈ ఐపిఎల్ సీజన్లో ధోని 5వ స్థానంలో కాకుండా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను ముందు వస్తే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇటీవల రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో మూడు పరుగులతో ఓడిపోయిన తర్వాత గవాస్కర్ ముందే చెప్పారు కానీ ధోని వినలేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: