కొత్త రూల్.. పరుగుల వరద పారించినా.. టీమిండియాలో నో ఛాన్స్?

praveen
బీసీసీఐ  నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఒక్క యువ ఆటగాడికి తమ ప్రతిభ ఏంటో నిరూపించుకునేందుకు మంచి వేదికగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఎంతో మంది యువ ఆటగాళ్ల పరాక్రమాన్ని అభిమానులు చూసారు అని చెప్పాలి. ఇలా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న క్రికెటర్లలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఒకరు అని చెప్పాలి. గత రెండు సీజన్స్ నుంచి కూడా నిలకడగా ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న తిలక్ వర్మ.. ఈ ఏడాది కూడా మంచి ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్ లోనే 92 పరుగులు చేసి  కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక రెండవ మ్యాచ్ లో 57 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు.

 అయితే కేవలం తిలక్ వర్మ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం  వహిస్తున్న  యశస్వి జైస్వాల్ .. ఢిల్లీ జట్టులో కొనసాగుతున్న సాయి సుదర్శన్.. లక్నో జట్టు తరుపున ఆడుతున్న ఆయుష్ బదోని కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ యువ క్రికెటర్లు అటు ఐపిఎల్ లో ఎంతలా పరుగుల వరద పారించినప్పటికీ టీమిండియాలో చోటు దక్కడం  మాత్రం కష్టమే అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల  బీసీసీఐ టీమిండియా ఎంపిక విషయంలో ఒక కొత్త రూల్  అమలులోకి తీసుకువచ్చింది. ఇక దీని ప్రకారం ఐపీఎల్లో ఎంతలా వీరోచితమైన ప్రదర్శన చేసినప్పటికీ ఇక యువ ప్లేయర్లకు అటు టీమ్ ఇండియాలో చోటు దక్కడం మాత్రం అంత ఈజీ కాదు అని చెప్పాలి.

 ఎందుకంటే ఈ ఏడాది బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం కేవలం ఐపిఎల్ లో మంచి ప్రదర్శన ఆధారంగా ఏ ఆటగాడిని కూడా టీమిండియాలోకి ఎంపిక చేయకూడదు. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు దేశవాలి క్రికెట్ లో కూడా పరుగులు సాధింది సత్తా చాటాల్సి ఉంది. ఇలా దేశవాళి క్రికెట్తో పాటు ఐపీఎల్ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకొని టీమ్ ఇండియాలోకి సెలక్ట్ చేయబోతున్నారట. దీంతో ఐపీఎల్లో ఎంతలా పరుగుల వరద పారించిన దేశవాళీ క్రికెట్లో రాణించకపోతే మాత్రం యువ ఆటగాళ్లకు టీం ఇండియాలో ఛాన్స్ లేనట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: