ఐపీఎల్ టైటిల్ గెలిచేది.. ఆ జట్టే : కలిస్

praveen
సాధారణంగా  ఏదైనా టోర్నీ జరుగుతుందంటే చాలు ఇక ఆ టోర్నికి సంబంధించి అటు మాజీ ఆటగాళ్లందరూ కూడా రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి రివ్యూలు కొన్ని కొన్ని సార్లు నిజం అవుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు మాత్రం అవి కేవలం ఒక అంచనాగానే మిగిలిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇప్పటినుంచే రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇలా మాజీ ఆటగాళ్లు పంచుకుంటున్న అభిప్రాయాలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

 కాగా ఐపీఎల్ సీజన్ 16 నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ జరగబోతుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ ఇంకా మొదలుకానే లేదు అప్పుడే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో టైటిల్ విజేత ఎవరు అనే విషయంపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్రౌండర్ కలిస్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అన్ని జట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి అంటూ అభిప్రాయపడ్డాడు కలిస్. ఈ క్రమంలోనే అన్ని మ్యాచ్లు కూడా హోరాహోరీగా జరగడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నా అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ బరిలో నిలుస్తాయి అంటూ అంచనా వేశాడు సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్రౌండర్ కలిస్ . ఇక ఫైనల్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ ఛాంపియన్గా నిలుస్తుందని భావిస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపిఎల్ హిస్టరీలో ముంబై ఐదుసార్లు టైటిల్ విజేత కాగా.. ఢిల్లీ 2020 లో ఫైనల్ వరకు వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: