దసరా సినిమా కోసం.. ముందుగా నానిని అనుకోలేదు : శ్రీకాంత్ ఓదెల

praveen
మొన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా రంగస్థలం, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలకు అటు సుకుమార్ దగ్గర పని చేసిన శ్రీకాంత్ ఓదెలా ఇక మొదటిసారిగా దర్శకుడి అవతారం ఎత్తి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. నాచురల్ స్టార్ నాని హీరోగా దసరా సినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్ ఓదెలా. తెలంగాణ లోని ఓ గ్రామంలోని పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన  ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకే సమయంలో రిలీజ్ చేశారు.

 ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. మా సొంత ఊరు పెద్దపల్లి దగ్గర్లోని సింగరేణి క్వార్టర్స్ లో ఉండే వాళ్ళం. సింగరేణిలో మా నాన్న ఉద్యోగి. నా బాల్యమంతా అక్కడే జరిగింది. వీర్లపల్లి గ్రామం అమ్మమ్మ వాళ్ళు ఊరు. నా జీవితంపై ఆ ఊరు ప్రభావం ఎంతగానో ఉంది. అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగానే కథ రాసుకున్నాను. ఇక నిర్మాత సుధాకర్ వద్దకు వెళ్తే ఆయనకు కథ నచ్చింది. వెంటనే నాని వద్దకు పంపించారు. అయితే దసరా సినిమాను ఏ హీరోను దృష్టిలో పెట్టుకొని రాసుకోలేదు.

 కథ రాసుకున్న తర్వాతే నాని వచ్చారు. రంగస్థలం లాంటి సినిమాలను కూడా దృష్టిలో పెట్టుకొని కథ రాయలేదు. నా చిన్నతనంలో మా ఊర్లో జరిగిన సంఘటన ఆధారంగానే కథ రాసుకున్నాను అంటూ శ్రీకాంత్ ఓదెలా చెప్పుకొచ్చాడు. సుకుమార్ తీసిన జగడం సినిమా చూసి నేను కూడా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యా. ఇక సుకుమార్ దగ్గర పని చేసేందుకు ఎంతగానో తిరిగా. సుకుమార్ను కలిసాక ఒక షార్ట్ ఫిలిం తీయమన్నాడు. నేను తీసిన షార్ట్ ఫిలిం చూసి నాకు ఆయన డైరెక్షన్ టీంలో అవకాశం ఇచ్చారు అంటూ శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: