మైండ్ బ్లోయింగ్: ఆఫ్ఘానిస్తాన్ పై సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ !

frame మైండ్ బ్లోయింగ్: ఆఫ్ఘానిస్తాన్ పై సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ !

VAMSI
ఇటీవల పాకిస్తాన్ లో ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ద్వారా చాలా మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విధంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కొందరి ఆటగాళ్లను ఆఫ్గనిస్తాన్ తో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ కు ఎంపిక చేయడం జరిగింది. ఈ సిరీస్ కు ఎంపిక అయిన కుర్రాళ్లలో అబ్దుల్లా షఫీక్ , సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, ఇహసానుల్లా, జమాన్ ఖాన్ లు ఉన్నారు. అందులో భాగంగా మొదటి మ్యాచ్ యూఏఈ లోని షార్జా వేదికగా జరుగగా, మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో కేవలం 92 పరుగులకే పరిమితం అయింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరూఖీ 2, ముజీబ్ 2, నబి 2 వికెట్లు తీసి పాకిస్తాన్ ను కూల్చేశారు.
ఈ స్కోర్ ను ఆఫ్గనిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ తర్వాత నిన్న షార్జా లోనే రెండవ టీ 20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. కానీ మొదటి మ్యాచ్ లో ఓటమి నుండి ఏమీ పాఠాలు నేర్చుకోలేదు. ఆఫ్ఘన్ స్పీడ్ బౌలర్ ఫరూఖీ మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగినా ఇమాద్ వసీం మరియు షాదాబ్ ఖాన్ ల ఓపికతో కూడిన ఇన్నింగ్స్ ల వలన 20 ఓవర్ లకు 130 పరుగులు చేసింది. కాగా ఈ స్కోర్ ను ఆఫ్ఘన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2 -0 తేడాతో గెలుచుకుంది.
ఎంతమాత్రం బాబర్ అజాం మరియు మహమ్మద్ రిజ్వాన్ లు లేకపోయినా వరుసగా రెండు మ్యాచ్ లలో ఆఫ్గనిస్తాన్ పై ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహమ్మద్ హరీష్ , ఇమాద్ వసీం, అజామ్ ఖాన్, షాదాబ్ ఖాన్ . మహమద్ నవాజ్, నసీం షా లు ఉన్న మ్యాచ్ లు ఓడిపోవడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. మరి ఈ సిరీస్ లో మిగిలిన ఆఖరి మూడవ మ్యాచ్ ను అయినా గెలుచుకుని క్లీన్ స్వీప్ నుండి బయటపడతారా చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: