ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శనపై.. ఆకాష్ చోప్రా ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఐపీఎల్ హడావిడి మొదలైంది. మార్చి 31 తేదీ నుంచి అందరూ ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టోర్నిని వీక్షించి అదిరిపోయే క్రికెట్ మజాని పొందేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే ఈసారి ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా అటు విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో ఎన్నో జట్లు తమ జట్టులో ఉన్న కొంతమంది ఆటగాల్లను వదులుకొని కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నాయి.

 దీంతో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే అంచనాకు రాలేని విధంగా ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే గత ఏడాది డూప్లెసెస్ కెప్టెన్సీ లో పర్వాలేదు అనిపించింది బెంగళూరు జట్టు. ఇక ఈ ఏడాది బెంగళూరు జట్టులో ఎవరు బాగా రాణిస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా తన అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయం గురించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు.

 2023 ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ అదర కొడతాడు అంటూ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్సిబి తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కోహ్లీ నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోహ్లీ, డూప్లిసిస్ ఓపెనింగ్ చేయాలి అంటూ సూచించాడూ. రజత్ పటిదార్ వన్ డౌన్ లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత మాక్స్వెల్, లోమ్రార్, షాబాద్ అహ్మద్, దినేష్ కార్తీక్ ఆడాలని సూచించాడు. గత ఏడాది వేలంలో ఆర్ సి బి బ్రేస్ వెల్ ను తీసుకొని మంచి పని చేసింది అంటూ తెలిపాడు ఆకాష్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: