అనుష్కను మొదటిసారి కలిసినప్పుడు.. చాలా భయపడ్డా : కోహ్లీ
అయితే బెంగళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పటికీ కెప్టెన్ కేవలం కోహ్లీ మాత్రమే కాదు అటు డివిలియర్స్ కూడా అని అప్పుడు బెంగళూరు జట్టు అభిమానులు భావించే వారు అని చెప్పాలి. అంతలా వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతూ ఉండేది. ఇక వీరిద్దరు ఎక్కడ కలిసిన కూడా ఎంతో ఆప్యాయం గా పలకరించుకొని అన్ని విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ.. డివిలియర్స్ నిర్వహిస్తున్న మిస్టర్ 360 అనే షోకి హాజరయ్యాడు. ఇక ఈ షోలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.
ఈ క్రమం లోనే తన భార్య అనుష్క తో ఏర్పడిన బంధం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను తెలియ జేసాడు అని చెప్పాలి. మొదటి సారి అనుష్క శర్మను చూసినప్పుడు ఏమనిపించింది అంటూ డివిలియర్స్ ప్రశ్నించగా.. కోహ్లీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే మొదటి సారి అనుష్క శర్మను చూసినప్పుడు ఎందుకో చాలా భయ పడ్డాను అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య బంధం బలపడింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మ తనను అన్ని విషయాల్లో ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.