బాబర్ లో ఇంత అసూయ ఉందా.. ఐపీఎల్ పై కామెంట్స్?

praveen
ఛాన్స్ దొరికింది అంటే చాలు అటు పాకిస్తాన్ జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లు మాత్రమే కాదు ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఆటగాళ్లు కూడా ఏదో ఒక విధంగా భారత ఆటగాళ్లపై అంతేకాకుండా బీసీసీఐ తీసుకునే నిర్ణయాలపై కూడా ఏదో ఒక ఆరోపణ చేయడం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు ఇలాంటి ఆరోపణలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. ఎప్పుడు అటు బీసీసీఐ పై తమ అక్కసును వెళ్లగకుతూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశీయ లీగ్ గా కొనసాగుతుంది అన్న విషయం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. ఐపీఎల్కు అంత క్రేజ్ ఉంది కాబట్టే ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఇక ఈ లీగ్ లో ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కంటే తమ దేశ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ అత్యుత్తమమైనది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఐపిఎల్ ను తక్కువ చేస్తూ మాట్లాడటం ఇప్పటివరకు చాలా సార్లు చూసాం.

 అయితే ఇలా ఐపిఎల్ ను తక్కువ చేస్తూ మాట్లాడే ఆటగాళ్ళలో కేవలం మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకి కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ఐపీఎల్ పై తన అక్కస్సును వెలగక్కాడు బాబర్. ఐపీఎల్ కన్నా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ నిర్వహించే బిగ్ బాస్ లీగ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. అయితే బాబర్ వ్యాఖ్యలపై అటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఐపీఎల్ సక్సెస్ను ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ కు వస్తున్న ఆదరణ చూడలేక ఇక ఇలా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎప్పుడు ఏదో ఒక విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: