కోహ్లీ అలా చేస్తాడని.. నాకు ముందే తెలుసు : అశ్విన్

praveen
దాదాపు గత కొన్నేళ్ల నుంచి కూడా విరాట్ కోహ్లీ సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఫామ్ లేమీటో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇలాంటి వైఫల్యాన్ని కొనసాగించాడు. మొదటి మూడు మ్యాచ్లలో కూడా విరాట్ కోహ్లీ ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం సెంచరీ తో కదం తొక్కాడు. అంతేకాదు డబుల్ సెంచరీ చేయడమే లక్ష్యంగా దూసుకుపోయాడు. కానీ 186 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ఫార్మాట్లో సుదీర్ఘమైన కాలం తర్వాత ఇక సెంచరీ కరువును తీర్చుకున్నాడు విరాట్.

 దీంతో అతని ప్రదర్శన పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ కోహ్లీతో మాట్లాడిన విషయాలను ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు. మ్యాచ్ ముగిశాక కోహ్లీతో చాలాసేపటి వరకు మాట్లాడాను. అయితే ఇప్పుడు వరకు అతనితో ఇలాంటి చర్చ ఎప్పుడూ జరగలేదు. అతను బాగా ఆడుతున్న భారీ స్కూల్ చేయడం లేదని నాకు కూడా అనిపించింది.  క్రీజులో నిలుదొక్కుకునేందుకు సమయం తీసుకుంటున్నాడు. కానీ మంచి స్కోర్ వస్తుందనుకుంటున్న సమయంలో అవుట్ అవుతున్నాడు.
 ఇలాంటి సమయంలో ఆటగాళ్ల భుజం తట్టి.. బాగా ఆడావు.. ఇంకాస్త బాగా ఆడితే పెద్ద స్కోర్ చేస్తావని చెబితే అది ఆ వాళ్లకి ఒక పొద్దు బూస్టర్ గా పనిచేస్తుంది. నా విషయంలో ఇలాగే జరిగింది. నేను కోహ్లీ విషయంలో ఆ బాధ్యత తీసుకున్న. అతను భారీ స్కోర్ చేస్తాడని ముందుగానే అనుకున్న ఎందుకంటే అంతకు ముందు వన్డే సిరీస్ లో శ్రీలంక పై కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మా జట్టులో విరాట్ కోహ్లీ,  పూజార టాప్ టెస్ట్ బాట్స్మెన్లు అన్న విషయం తెలుసు. ఒకరు డిఫెన్స్ తో.. ఒకరు మంచి షాట్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: