విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తి.. వీడియో వైరల్?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో అందరికంటే ముందు ఉంటాడు అని చెప్పాలి. ఇక తన చర్యలతో ఎప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు అభిమానులకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఆశ్చర్యపరచడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలోనే కాదు నేరుగా మైదానంలో కూడా అభిమానులకు విరాట్ కోహ్లీ సర్ప్రైజ్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ ప్రత్యర్థి జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరైనా తనకు ఫాన్స్ ఉన్నారు అని తెలిస్తే ఏకంగా తన జెర్సీని లేకపోతే తన బ్యాట్ ను బహుమతిగా ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాడు.

 ఇక ఇటీవల ఆస్ట్రేలియా తో నాలుగో టెస్ట్ ముగిసిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ ఇలాంటిదే చేసి మరోసారి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కెరీకి తన జెర్సీ ని గిఫ్ట్ గా అందించాడు విరాట్ కోహ్లీ. ప్రత్యర్ధులు అని చూడకుండా ఇక ఇలాంటి అరుదైన గిఫ్ట్ ఇచ్చి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత కాసేపు వరకు కూడా వారిద్దరితో ముచ్చటించి కెరియర్ పరంగా బాగా రాణించాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇకపోతే విరాట్ కోహ్లీ అటు అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో మరోసారి తన మునుపటి ఫామ్ను అందుకున్నాడు అని చెప్పాలి. దాదాపు మూడున్నరేళ్ళ నుంచి టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. అంతకు ముందు జరిగిన మూడు మ్యాచ్లలో కూడా ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇక చివరి టెస్ట్ మ్యాచ్లో 156 పరుగులతో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ తనపై వస్తున్న విమర్శలు అన్నింటికీ కూడా బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ఇక బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ లపై అటు ఇరుజట్ల బ్యాట్స్మెన్లు పండగ చేసుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: