ఆస్ట్రేలియా కెప్టెన్ ను తప్పించేందుకు.. కోచ్ కుట్ర చేస్తున్నాడు : పాక్ మాజీ

praveen
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇక ఈ సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఈ టెస్ట్  సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా ప్రదర్శన ఒక్కసారిగా క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే పటిష్టమైన ఆస్ట్రేలియా నుంచి అటు భారత జట్టుకు గట్టి పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు.

 కానీ మొదటి రెండు మ్యాచ్లలో మాత్రం ఎక్కడ కనీస పోటీ ఇవ్వలేకపోయింది ఆస్ట్రేలియా జట్టు. వరుసగా రెండు మ్యాచ్లలో కూడా ఘోర పరాభవాలను మూటగట్టుకుంది అని చెప్పాలి. దీంతో ఆస్ట్రేలియా మిగతా రెండు మ్యాచ్లలో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అనూహ్యంగా పుంజుకుంది. ఇక ఎంతో దూకుడుగా ఆడుతూ టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడమే కాదు మూడో మ్యాచ్లో టీమిండియాకు సొంత గడ్డ పైన  ఓటమి కూడా రుచి చూపించింది ఆస్ట్రేలియా. ఇక నాలుగో మ్యాచ్లో కూడా గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతుంది అని చెప్పాలి.

 మొదటి రెండు మ్యాచ్లకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉండగా.. ఇక అతను వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లడంతో ఇప్పుడు స్మిత్ కెప్టెన్సీలో మూడు నాలుగు మ్యాచ్ లలో బలిలోకి దిగింది. ఇద్దరీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ప్రదర్శన ఎలా ఉంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ విమర్శలు కుప్పించాడు. తొలి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా రక్షణాత్మక ధోరణిలో ఆడింది.. చివరి రెండు టెస్ట్ మ్యాచ్లో దూకుడుగా ఆడుతుంది. ఇక ప్యాట్ కమిన్స్ ను  కెప్టెన్సీ నుంచి తప్పించి స్మిత్ ను కెప్టెన్ గా కొనసాగించాలని ఆస్ట్రేలియా కోచ్ కుట్ర చేస్తున్నాడు అంటూ పాక్ మాజీ ఆరోపించాడు. మెక్ డోనాల్డ్ ఒక సాదాసీదా ఆటగాడని.. అతని ఆలోచన కూడా అలాగే ఉంది అంటూ విమర్శలు గుర్తించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: