వావ్.. కోహ్లీకి సాధ్యం కానిది.. పూజార సాధించాడు?

praveen
టీమ్ ఇండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు చటేశ్వర్ పూజార. తన ఆటతీరుతో ఇక భారత క్రికెట్ లో నయా వాల్ గా ఒక అరుదైన బిరుదును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఈ బిరుదు కారణంగా అటు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పూర్తిగా దూరమయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అందరూ ఇష్టపడే ఐపీఎల్ లో కూడా ఏ ఫ్రాంచైజీ  ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ ని కొనేందుకు ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నిరాశపడని పూజారా ఇక భారత జట్టు తరఫున టెస్టుల్లో బాగా రాణిస్తూ ఇక రికార్డులను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. క్రీజులో పాతుకుపోయి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టడంలో పూజార దిట్ట అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ సందర్భంగా పూజార ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు మీద టెస్ట్ ఫార్మాట్లో 2000 పరుగులు  పూర్తి చేసుకున్న నాలుగవ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో మెరుగైన రికార్డు కలిగి ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి సైతం ఈ రికార్డు సాధ్యం కాలేదు.  కోహ్లీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 1793 పరుగులు మాత్రమే చేయగా.. పూజార మాత్రం కోహ్లీ కంటే 219 పరుగుల ముందంజలో ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక టెస్ట్ ఫార్మాట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న మూడవ భారత బ్యాట్స్మెన్ గా కూడా పూజార రికార్డ్ సృష్టించాడు.

 ఈ లిస్టు చూసుకుంటే మహమ్మద్ అజారుద్దీన్ 33 ఇన్నింగ్స్ లలో 2000 పరుగులు చేస్తే.. ఆ తర్వాత రోహిత్ శర్మ 36 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు. ఇక ఇప్పుడు చటేశ్వర్ పూజార సైతం కెప్టెన్ రోహిత్ శర్మతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 38, వీరేంద్ర సెహ్వాగ్ 39, విరాట్ కోహ్లీ 39, రాహుల్ ద్రావిడ్ 41, ఇన్నింగ్స్ లలో 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లుగా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరుగుతుంది అని చెప్పాలి. అటు ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 480 పరుగుల కొండంత టార్గెట్ ను చేదించే పనిలో ఉంది టీమిండియా జట్టు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: