రోహిత్ శర్మ అరుదైన రికార్డ్.. భారత క్రికెట్లో ఆరో ప్లేయర్?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ మొదటి వరుసలో ఉంటాడు అని చెప్పాలి. ఇక అటు మరో అత్యుత్తమ ఆటగాడు అయినా విరాట్ కోహ్లీకి సమవుజ్జిగా కొనసాగుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా టీమ్ ఇండియాకు రెండు కళ్ళలాంటివారు అని చెప్పాలి. ఇక ఇద్దరు అద్భుత ఆటగాళ్లుగా  కొనసాగుతూ జట్టును ఎంతో విజయపతంలో ముందుకు నడిపిస్తున్నారు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండగా.. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కూడా సారధిగా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ లాగానే ఎన్నో ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. ఎంతో మంది అభిమానులు రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. దీనికి కారణం అతను వరుసగా డబల్ సెంచరీలు సాధించడమే. అంతేకాదు సిక్సర్ల వీరుడు అని కూడా మరికొంతమంది అభిమానులు అంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు తన ఆట తీరూతో ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టిన రోహిత్ శర్మ ఇప్పటికీ రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే అహ్మదాబాద్ వ్యతిరేకంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి.

 అంతర్జాతీయ క్రికెట్లో 17వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.  ఇక భారత క్రికెట్లో చూసుకుంటే ఈ అరుదైన రికార్డును అందుకున్న ఆరవ ప్లేయర్గా నిలిచాడు. 48 టెస్టుల్లో 3348 పరుగులు చేసిన రోహిత్ శర్మ
.. ఇక వన్డే క్రికెట్లో 241 మ్యాచ్ లలో 9782, టీ20 లలో 148 మ్యాచ్లో 3853 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, మహేంద్రసింగ్ ధోని, కోహ్లీ కూడా ఇప్పటివరకు భారత క్రికెట్లో 17000 పరుగుల మార్కు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: