రోహిత్ తప్పు చేశాడు.. అది సరైన నిర్ణయం కాదు : దినేష్ కార్తీక్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు అనే విషయంపై కూడా అటు విశ్లేషకులు సైతం ఒక అంచనాలకు రాలేకపోతున్నారు. అయితే ఇక మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం 480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఇప్పుడు భారీ టార్గెట్ ను ఛేదించేందుకు భారత జట్టు బ్యాటింగ్ చేస్తూ ఉంది అని చెప్పాలి.

 అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్లో కాస్త ఒత్తిడిలో కనిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ మ్యాచ్ కు కామెంటెటర్ గా వ్యవహరిస్తున్న భారత సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ రోహిత్ శర్మ కెప్టెన్సీ తీరును విశ్లేషించాడు. రోహిత్ శర్మ అక్షర్ పటేల్ ను సరిగ్గా వాడుకోలేకపోయాడు అంటూ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.. అంతేకాదు కొత్త బంతిని తీసుకున్న సమయం కూడా సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు దినేష్ కార్తీక్.

 రోహిత్ తొలి రోజు కెప్టెన్సీలో తన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ బౌలింగ్ మార్పులు బాగున్నాయి. అంతేకాకుండా ఎంతో ఉత్సాహంగా కూడా కనిపించాడు. తొలిరోజు ఆటలో తన కెప్టెన్సీ వ్యూహాలతో నాలుగు వికెట్లు రాబట్ట గలిగాడు. అయితే అతను కొత్త బంతిని తీసుకున్న సమయం మాత్రం సరైనది కాదు. అది గొప్ప నిర్ణయం అని నాకు అనిపించడం లేదు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్లతో ఎక్కువ ఓవర్లు వేయించిన రోహిత్.. అక్షర్ పటేల్ ను మాత్రం సరిగ్గా వాడుకోలేకపోయాడు. కొత్త బంతిని తీసుకున్నప్పుడు అక్షర్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇస్తే బాగుండేది. ఎందుకంటే అక్షర్ పటేల్ స్వదేశీ పిచ్ల మీద బౌన్స్ రాబట్టగలడు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: