ధోని నిజంగా గ్రేట్.. లెజెండ్స్ అందరూ ఈ మాట చెప్పేసారుగా?

praveen
భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది కెప్టెన్లు ఉన్నప్పటికీ అటు మహేంద్ర సింగ్ ధోని కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పాలి. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో మూడు సార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. సాధారణంగా ఒత్తిడిలో ఏ కెప్టెన్ అయినా సరే చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఒత్తిడి సమయాల్లో కూడా తన చిరునవ్వుతోనే ప్రత్యర్థులను వనికిస్తూ ఉంటాడు.

 వికెట్ల వెనకాల ఉంటూ మ్యాచ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మహేంద్రసింగ్ ధోని దిట్ట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ధోనీకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు
 ఇక ఎంతోమంది క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చే ఎంతో మంది యువ ఆటగాళ్లకు రోల్ మోడల్ గా కొనసాగుతూ ఉంటాడు ధోని. ఇకపోతే ఇటీవల రాపిడ్ ఫైర్ విత్ లెజెండ్స్ అనే కార్యక్రమాన్ని స్పోర్ట్స్ 18 చానల్ నిర్వహించింది. ఇందులో మాజీ క్రికెటర్లు ధోనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అత్యంత నిస్వార్థ ఆటగాడు ఎవరు అని ఆకాష్ చోప్రా రాబిన్ ఉత్తప్పను ప్రశ్నించాడు.  అయితే అతను ఎవరో కాదు మహేంద్రసింగ్ ధోని అని రాబిన్ ఉత్తప్ప  సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత స్పందించిన స్కాట్ స్టైరిష్ ఈ ప్రశ్నకు విలియంసన్ అని సమాధానం చెప్పాడు. కివీస్ ఆటగాడు కాకుండా మరో ఆటగాడిని ఎంచుకోవాలని ఆకాశ చోప్రా చెబితే.. ఇక స్కాట్ స్టైరిష్ కూడా ధోనీ పేరున చెప్పడం గమనార్హం. కానీ పార్థివ్ పటేల్ మాత్రం తనను తాను సరదాగా నిస్వార్ధ ఆటగాడిగా చెప్పుకోవడంతో అక్కడ ఉన్నవాళ్లు అందరూ నవ్వుకున్నారు. ఇక అనిల్ కుంబ్లే, క్రిస్ గేల్ కూడా ధోనీ పేరే చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: