జడేజాతో చాలా కష్టం.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
రవీంద్ర జడేజా.. ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడు మ్యాజిక్ చేస్తూ వికెట్లు పడగొట్టడమే కాదు. ఇక జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా తన బ్యాటింగ్ సామర్థ్యం ఏంటో చూపిస్తూ సత్తా చాటుతూ ఉంటాడు. ఇప్పుడు వరకు తన ఆల్ రెండు ప్రదర్శనతో రవీంద్ర జడేజా ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక రవీంద్ర జడేజా మైదానం లో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి వికెట్ తీసేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు అస్సలు ఇష్టపడడు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు జడేజా అగ్రెసివ్ గా కూడా కనిపిస్తూ ఉంటాడు. తన మెరుపు ఫీల్డింగ్ తో ఎప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే రవీంద్ర జడేజా అటు మైదానంలో ఎలా మెలుగుతాడు అనే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

 ఇండోర్ వేదిక గా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో తాము డిఆర్ఎస్ ను సరిగా వినియోగించు కోలేకపోయాము అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.  అయితే రవీంద్ర జడేజా తో కొంచెం కష్టం అంటూ తెలిపాడు. ప్రతి బంతి అవుట్ అని భావిస్తాడని తెలిపాడు. దీంతో రివ్యూ తీసుకోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకోవచ్చాడు. ఇక రేపటి నుంచి జరిగే ఫైనల్ టెస్టు లో డిఆర్ఎస్ను సక్రమంగా వినియోగించుకుంటాం అంటూ వెల్లడించాడు. కాగా అహ్మదాబాద్  వేదికగా మార్చ్ 9వ తేదీన మ్యాచ్ జరగబోతూ ఉండగా  అటు టీమిండియా గెలిస్తే.. సిరీస్ గెలవడం తో పాటు వరల్డ్  టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: