మరో స్టార్ బౌలర్ దూరం.. గాయాలతో ముంబై ఇండియన్స్ కి షాకిస్తున్న బౌలర్లు?

praveen
ఐపీల్ ప్రారంభానికి ముందు ఈ సీజన్ లో పాల్గొనబోతున్న జట్లకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కి ఫామ్ లో ఉన్న ఇద్దరు బౌలర్లు గాయాలతో ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ వంతు వచ్చింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను కూడా గాయాలు వదలడం అవ్వలేదు. ఇది వరకే ముంబై ఇండియన్స్ కి లీడ్ బౌలర్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక కు అయినా ఇంజురీ కారణం గా సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ఫెసర్ అయినా జో రీచర్డ్సన్ కూడా ఈ సీజన్ లో పాల్గొనడం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దాంతో త్వరలో జరగనున్న భరత్ లో ఆస్ట్రేలియా సిరీస్ లో  కూడా జో రీచర్డ్సన్ పాల్గొనలేక పోతున్నాడు. ఈ విషయాన్నీ క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా సోమవారం ప్రకటించింది. తన మోచేతి కి ఉన్న గాయం ఇంకా నయ్యం అవ్వని కారణంగా పూర్తి స్థాయి ఫిట్ నెస్ సాదించలేకపోయాడు. దాంతో ఐపీల్ 2023 లో పాల్గొనడం దాదాపు అనుమానమే. తన మోచేతి గాయం తగ్గడానికి నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ చెప్తున్నారు.   జో రీచర్డ్సన్ స్థానం లో భరత్ పర్యటనకు నాథన్ ఎల్లిస్ పర్యటించబోతున్నాడు. ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం చాల వీక్ గా ఉంది. ఇక ఇప్పుడు రీచర్డ్సన్ కూడా దూరం అయితే జట్టు మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ ఆశలు మొత్తం ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పైన పెట్టుకుంది. ఒకవేళ ఆండర్సన్ గాయం నుంచి కోలుకున్న కూడా ఐపీల్ లో మధ్యలో రావడం కష్టం కావచ్చు.  జోఫ్రా ఆర్చర్ ఐపీల్ 2023 సీజన్ ఆడటం కోసం ఇండియాలో పర్యటించడానికి ఇంగ్లాండ్ బోర్డు అనుమతులు కూడా ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: