క్రికెట్ చరిత్రలో.. అత్యంత చెత్త రివ్యూ ఇదేనేమో?

praveen
సాధారణంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఫీల్డ్ అంపైర్స్ సైతం ఒత్తిడిలో ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ఎంపైర్ ఇచ్చింది తప్పుడు నిర్ణయం అని భావిస్తే ఇక జట్టు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి రివ్యూ కోరుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనినే క్రికెట్ పరిభాషలో డిఆర్ఎస్ అని అంటూ ఉంటారు. అయితే ఈ రివ్యూ ద్వారా ఎంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసి ఇక సరైన నిర్ణయం ఏంటి అన్నది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

 ఇక ఇలా ఒక జట్టు కెప్టెన్ డిఆర్ఎస్ కోరుకున్నప్పుడు థర్డ్ అంపైర్ గా ఉన్న వ్యక్తి ఏకంగా అన్ని కోణాలలో కూడా అటు బంతిని గమనిస్తూ ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన నిర్ణయం తప్ప లేకపోతే ఒప్పా అన్న విషయాన్ని తుదిగా నిర్ణయిస్తుంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా డిఆర్ఎస్ తీసుకోవడం విషయంలో ప్రతి జట్టు కెప్టెన్ కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు.  కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ తీసుకున్న డిఆర్ఎస్ కాస్త ఇక క్రికెట్ చరిత్రలోనే ఒక చెత్త రివ్యూ గా మారిపోయింది అని చెప్పాలి.

 బంగ్లాదేశ్ కెప్టెన్ తమిల్ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయంతో ఆ జట్టు అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అని చెప్పాలి. ఇన్నింగ్స్ 48 ఓవర్లో తస్కిన్ అహ్మద్ బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో తస్కిన్ వేసిన యార్కర్ బంతిని ఆదిల్ రషీద్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. అయితే బంతి రషీద్ ప్యాడ్ కి దూరంగా బ్యాట్ అంచున తాకింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ ఎల్బీ కి అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ ఎంపైర్ మాత్రం దానిని నాట్ అవుట్ గా ప్రకటించలేదు. అయితే ఇక ఈ విషయంలో వెనక ముందు ఆలోచించని బంగ్లాదేశ్ కెప్టెన్ తమిళ్ ఇక్బాల్ ఏకంగా రివ్యూ తీసుకున్నాడు. బంతి ప్యాడ్ కి దూరంగా వెళ్లి ఏకంగా బ్యాడ్ ఎడ్జ్ తీసుకుందన్న విషయం అందరికీ అర్థమైంది. కానీ ఇలాంటి సమయంలో  సమయంలో తమిమ్ ఇక్బాల్ రివ్యూ తీసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఇదే క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ అంటూ ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: