అయ్యో గిల్.. ఆదుకుంటాడు అనుకుంటే.. ఆగం చేసిండు?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది భారత జట్టు. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి జోరు మీద ఉన్న టీమ్ ఇండియా జట్టు.. మూడో మ్యాచ్లో కూడా అలవోకగా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అర్హత సాధిస్తుంది అని భావించారు. అయితే కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం టీమిండియా గెలుస్తుందా లేకపోతే ఓడిపోతుందా అన్నది మాత్రం అర్థం కాని విధంగానే మారిపోయింది అని చెప్పాలి.

 ఎందుకంటే భారత జట్టు విజయం సాధిస్తుంది అనుకుంటే ఇక మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం తడబడుతుంది. ఆస్ట్రేలియా బౌలింగ్ దెబ్బకు పూర్తిగా చేతులెత్తేస్తుంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ లోనే తక్కువ పరుగులు చేసి ఆల్ అవుట్ అయిన భారత జట్టు ఇక రెండవ ఇన్నింగ్స్ లో కూడా కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. అయితే గత రెండు మ్యాచ్లలో కూడా ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ను జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది అని చెప్పాలి.

 ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్న శుభమన్ గిల్ ను కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి తీసుకుంది. అయితే ఇక ఇలా జట్టులోకి వచ్చిన గిల్ అదరగొట్టడం ఖాయమని తప్పకుండా సెంచరీ కూడా చేస్తాడని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో శుభమన్ గిల్ మాత్రం నిరాశ పరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. మొదటి మ్యాచ్ లో తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయిన శుభమన్ గిల్ ఇక రెండవ ఇన్నింగ్స్ లో కూడా అదే వైఫల్యాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. 15 బంతులను ఎదుర్కొన్న శుభమన్ గిల్ లియోన్ కి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు అని చెప్పాలి. దీంతో శుభమన్ గిల్ ఆట తీరు చూసిన తర్వాత జట్టులోకి వచ్చి ఆదుకుంటాడు అనుకుంటే కొంప ముంచాడు అంటూ ఎంతోమంది భారత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: