అరంగేట్రం మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ.. ఏం కొట్టాడబ్బా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఉన్న సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక టీమ్ ఇండియాలోకి వచ్చే ఫ్యూచర్ స్టార్లు ఎవరు అని ప్రశ్న వచ్చిన ప్రతిసారి కూడా ఎంతోమంది యువ క్రికెటర్లు ఫ్యూచర్ స్టార్ ఎవరో కాదు అది నేనే అని చెప్పకనే చెబుతూ ఉన్నారు. మాటల్లో చెప్పడం కాదు ఏకంగా తమ ఆట తీరుతోనే నిరూపిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దేశ వాలి క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎప్పుడూ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటూ ఉన్నారు.

 సెంచరీలు డబుల్ సెంచరీలను సైతం ఎంతో అలవోకగా బాదేస్తూ తమకు తిరుగులేదు అని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా సెలెక్టర్లు చూపును ఆకర్షించి జట్టులోకి వస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇలా జట్టులోకి రావడమే కాదు ఇక్కడ మంచి ప్రదర్శన చేసి ఇక జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఒక యువ ప్లేయర్ ఏకంగా డబుల్ సెంచరీ చేయడం కాస్త వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ముంబై యువ ఓపెనర్ అయిన యశస్వి జైశ్వల్ ఇరానీ ట్రోఫీ  అరంగేట్రం మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.

 ఈ టోర్నీలో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తరఫున బరిలోకి దిగాడు యశస్వి జైశ్వల్. మధ్యప్రదేశ్తో ఇటీవలే జరిగిన మ్యాచ్లో ఏకంగా 230 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అంతేకాదు ఇరానీ ట్రోఫీలో ఇలా డబుల్ సెంచరీ సాధించిన పదవ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. 30ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 213 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక అతనికి తోడు మరో ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్  కూడా 154 పరుగులతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇలా తొలి రోజు మ్యాచ్ లోనే అటు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ప్రదర్శన చేయడంతో ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: