గుడ్ న్యూస్ : 2024 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన టీమిండియా?

praveen
ఇటీవల సౌత్ ఆఫ్రికా వేదిక జరిగిన మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా తప్పకుండా ఈసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక టీమ్ ఇండియాలో ఉన్న అందరు ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉండడంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించడం ఖాయం అనుకున్నారు.

 అందరూ అంచనాలు పెట్టుకున్నట్లుగానే లీగ్ మ్యాచ్లలో టీమిండియా అదిరిపోయే ప్రదర్శన చేసింది అని చెప్పాలి. అయితే లీగ్ మ్యాచ్ లలో వరసగా నాలుగింటిలో మూడు విజయాలు సాధించి అదరగొట్టిన టీమిండియా సెమీఫైనల్ లో మాత్రం అదే రీతిలో ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. పటిష్టమైన ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా పూర్తిగా చేతులెత్తేసింది అని చెప్పాలి. అంతకుముందు జరిగిన మ్యాచ్లో వరుసగా టీం ఇండియాను ఆదుకున్నవారే సెమి ఫైనల్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేశారు. దీంతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన టీం ఇండియా జట్టు ఇక టోర్నీ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక టీమిండియా ఇలా పేలవ ప్రదర్శన చేసి నాకౌట్ మ్యాచ్ లో ఓడిపోయి వెను తిరగడంపై కాస్త విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.. ఇక అభిమానులు వరల్డ్ కప్ గెలవలేకపోయామే అని నిరాశలో మునిగిపోయారు. అయితే ఇలా ఫాన్స్ నిరాశలో ఉన్న సమయంలో ఇక ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అదింది అని చెప్పాలి. ఎందుకంటే 2022 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు నిరాశ పరిచిన.. అటు 2024 మహిళల టీ20 వరల్డ్ కప్ లో మాత్రం నేరుగా అర్హత సాధించింది టీమ్ ఇండియా జట్టు. సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో రెండు గ్రూపులలో కూడా తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు 2024 వరల్డ్ కప్  కు నేరుగా అర్హత సాధించాయి. ఇందులో టీమిండియా కూడా ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: