టీమ్ ఇండియాకు వైస్ కెప్టెన్ అవసరం లేదు : రవి శాస్త్రి

praveen
గత కొన్ని రోజుల నుంచి కూడా భారత జట్టుకి కొత్త వైస్ కెప్టెన్ ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు అటు ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్లు టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రెండో టెస్ట్ మ్యాచ్లలో కూడా పేలవ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టీమ్ ఇండియా యాజమాన్యం.

 ఇక పేలవ ప్రదర్శనలో కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ను తుది జట్టులోకి తీసుకుంటుందా లేదా అన్న విషయం కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే కేవలం రాహుల్ విషయం పక్కన పెడితే ఇక ఇప్పుడు అతని వైస్ కెప్టెన్సీ  నుంచి తప్పించిన నేపథ్యంలో ఇక మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్లకు కొత్త వైస్ కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెరమీదకి వస్తూ ఉన్నాయి. ఇక కొంతమంది రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది మరికొన్ని పేర్లను తెరమీదకి తీసుకువస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై టీం ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 స్వదేశంలో జరుగుతున్న  టెస్ట్ సిరీస్ కు భారత జట్టుకు వైస్ కెప్టెన్ అవసరం లేదు అంటూ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో మాత్రం ఇక భారత జట్టుకు వైస్ కెప్టెన్ తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ ఫామ్ గురించి టీం మేనేజ్మెంట్ కు అంతా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో గిల్ ను ఎలా వాడుకోవాలో అనే విషయంపై కూడా కేఎల్ రాహుల్ కు క్లారిటీ ఉంది అంటూ తెలిపాడు. తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలన్న విషయంపై కూడా స్పష్టత ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: