మాక్కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో రెండు మెగా టోర్నీలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక అందరూ కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతూ ఉండగా.. అటు పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఇక ఈ రెండు టోర్నీలలో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న భారత్, పాకిస్తాన్ జట్లు కొనసాగుతాయా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మధ్య పూర్తిగా క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉంది. అందుకే ఇక ఇరు జట్లు కూడా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడక దశాబ్ద కాలం గడిచిపోతుంది.

 కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలబడుతున్నాయ్ అని చెప్పాలి. ఇక ఎప్పుడు ఆసియా కప్ అటు పాకిస్తాన్ లో జరుగుతున్న నేపథ్యంలో తాము పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని తటస్థ వేదిక పైన ఈ టోర్నీ నిర్వహిస్తేనే పాల్గొంటాము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఒకవేళ భారత జట్టు పాకిస్తాన్లో ఆసియా కప్ ఆడటానికి ఇష్టపడకపోతే తాము కూడా భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనేది లేదు అంటూ ఇప్పటికే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కొంతమంది వ్యాఖ్యానించారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ఒకవేళ ఇండియా ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాకపోతే ఇక వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ కూడా ఇండియాకు వెళ్ళబోదు అంటూ స్పష్టం చేశాడు. మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మేము కూడా ఛాంపియన్లమే. మూడు ఫార్మట్లలో నెంబర్ వన్ స్థానాన్ని కూడా సొంతం చేసుకున్నాం. ఛాంపియన్స్ ట్రోపీ కూడా గెలిచాము. అయితే ఈ విషయం రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి అంటూ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: