ఉమెన్స్ టీమ్ లో లేడీ కేఎల్ రాహుల్.. ఎవరో తెలుసా?

praveen
టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కు ఇక సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. సెమీఫైనల్ లో అటు పటిష్టమైన ఆస్ట్రేలియా తో హోరా హోరీగా పోరాడిన టీమిండియా జట్టు.. చివరికి ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.  దీంతో భారత జట్టు అభిమానులు అందరిలో కూడా నిరాశ మిగిలిపోయింది. పేలవమైన బౌలింగ్ దారుణమైన బ్యాటింగ్ కారణంగా చివరికి సెమి ఫైనల్లో ఓడిపోయి టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక టీమిండియా మహిళల జట్టు లేడీ కేఎల్ రాహుల్ ఉంది అంటూ ఒక పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇలా లేడీ కేఎల్ రాహుల్గా అటు క్రికెట్ ప్రేక్షకులు అభివర్ణిస్తున్న  ప్లేయర్ ఎవరో కాదు స్మృతి మందాన. కేఎల్ రాహుల్ సాధారణ మ్యాచులలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇప్పుడు స్మృతి మందాన సైతం గత కొంతకాలం నుంచి ఇలాంటిదే చేస్తుంది. సాదాసీదా లీగ్ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేస్తున్న స్మృతి మందాన.. నాకౌట్స్ పోరులో మాత్రం చేతులెత్తేయడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే కీలకమైన సెమీఫైనల్ పోరులో కూడా ఇదే జరిగింది. ఓపెనర్ గా బరిలోకి   దిగి జట్టుకు మంచి ఆరంభాలు అందించాల్సింది పోయి.. ఏకంగా రెండు పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకుంది అని చెప్పాలి. అయితే అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్ లలో మాత్రం స్మృతి మందాన వరుసగా అర్థ సెంచరీలు చేసి అదరగొట్టింది అని చెప్పాలి. అయితే స్మృతి మందాన నాకౌట్ మ్యాచ్ లో చేతులెత్తేస్తుంది అని ఉన్న అపవాదు మాత్రం మరోసారి నిజం చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పురుషుల జట్టులో కేఎల్ రాహుల్ కు.. మహిళా జట్టులో స్మృతి మందానకు కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో చేతులెత్తేయడం అలవాటే అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: