ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హర్మన్ ప్రీత్?

praveen
ఇటీవల భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ జరిగింది అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా లీగ్ దశలో అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోయిన టీమ్ ఇండియా జట్టు.. సెమీఫైనల్ లో మాత్రం పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించలేకపోయింది. అయితే ఒకానొక సమయంలో భారత జట్టుదే విజయం ఖాయం అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కెప్టెన్ హార్మన్ ఔట్ అయినా తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.. అప్పటివరకు భారత జట్టు విజయం సాధిస్తుంది అని నమ్మకం పెట్టుకున్న అభిమానుల్లో నిరాశ నిండిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో దూకుడుగా ఆడింది. అప్పటికే తీవ్రమైన జ్వరం వేధిస్తూ ఉన్నప్పటికీ ఇక లెక్కచేయకుండా దేశం కోసం పోరాడటానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఎంతో జోరు మీద కనిపించింది అని చెప్పాలి. హార్మన్ ప్రీత్ కౌర్ స్పీడ్ చూస్తే ఎంతో అలవోకగా టీమిండియా  విజయం అందించడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఇక హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత పరుగులు తీస్తున్న సమయంలో ఇక ఆమె బ్యాట్ అక్కడ మట్టిలో ఇరుక్కుపోవడంతో చివరికి రన్ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 ఇక ఈ ఒక్క ఘటనతో అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ హార్ట్ బ్రేక్ అయినంత పని అయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఘటనపై అటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. స్కూల్ గర్ల్ మిస్టేక్  సిల్లీ అవుట్ అంటూ కామెంట్ చేశాడు. అయితే దీనిపై భారత క్రికెట్ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఇదే విషయంపై స్పందించిన భారత మహిళల జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ అతనికి కౌంటర్ ఇచ్చింది.  తాను చాలా ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నానని.. అది స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదని.. బ్యాట్ మట్టిలో ఇరుక్కుపోవడం వల్లే రన్ అవుట్ కావలసిన పరిస్థితి వచ్చింది అంటూ గట్టిగానే బదులిచ్చింది టీమిండియా కెప్టెన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: