టి20 వరల్డ్ కప్ : ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్?

praveen
సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ప్రస్థానం ముగిసింది. లీగ్ దశలో ఎంతో అద్భుతంగా రానించి ఇక సెమి ఫైనల్ అడుగుపెట్టిన భారత మహిళల జట్టు సెమి ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విజయం కోసం చివరి వరకు పోరాడి ఓడింది అని చెప్పాలి. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఐదుసార్లు వరల్డ్ కప్ ఛాంపియన్గా  నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే సెమి ఫైనల్లో విజయం కోసం అటు భారత మహిళా క్రికెటర్లు పోరాడిన తీరు గురించి ప్రస్తుతం  చర్చించుకుంటున్నారు అందరూ. ఈ క్రమంలోనే అద్భుతమైన పోరాటపటిమపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే నువ్వా నేన అన్నట్లుగా సాగిన ఫైనల్ మ్యాచ్లో అటు భారత జట్టు గెలుస్తుందేమో అనే నమ్మకం అందరిలో కలిగింది. కారణం అటు కెప్టెన్ హార్మన్ అద్భుతమైన షాట్లు ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే హార్మన్ ప్రీత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును విజయం వైపు తీసుకెళ్లడం ఖాయమని అందరూ భావించారు.

 సెమీఫైనల్ లో భారత జట్టు దే విజయం అని అందరూ అనుకున్నారు. ఇక టీమిండియా అటు ఫైనల్ అడుగుపెట్టినట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కానీ అంతలోనే అందరి హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఒకటి జరిగింది. భారత జట్టును ఒంటిచేత్తో విజయం వైపు నడిపిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగుల వద్ద సింపుల్గా సింగిల్ తీస్తూ రన్ అవుట్ అయింది. సాధారణంగా అయితే హర్మన్  ప్రీత్ క్రీజ్ లో బ్యాట్ పెట్టాల్సింది. కానీ బ్యాట్ పెట్టే సమయానికి బ్యాట్ కింద మట్టిలో తట్టుకోవడంతో ముందుకు వెళ్ళలేదు. దీంతో ఆసీస్ కీపర్ రనౌట్ చేసి అప్పీల్ చేయడంతో రిప్లై లో హార్మన్ ప్రీత్ రన్ అవుట్ అయినట్టు తేలింది. ఆ క్షణమే భారత క్రికెట్ ప్రేక్షకుల హార్ట్ బ్రేక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: