అమాయకంగా కనిపించే బిగ్ బాస్ బ్యూటీ.. బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిందిగా?
ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో కామన్ కదా.. ఇప్పుడు కొత్తగా చర్చించుకోవడానికి ఏముంది అనుకుంటున్నారు కదా.. అయితే ఇక్కడ చర్చ బోల్డ్ సీన్స్ గురించి కాదు ఈ సీన్స్ లో నటించిన హీరోయిన్ గురించి. బిగ్బాస్ బ్యూటీ వాసంతి అందరికీ గుర్తుండే ఉంటుంది. గత సీజన్లో హౌస్ లోకి కంటెస్టెంట్గా వెళ్లిన వాసంతి అభిమానులను సంపాదించుకుంది. అయితే హౌస్ లో అందరూ ఇతర కంటెస్టెంట్లతో గొడవలకు దిగి రెచ్చిపోయిన... వాసంతి మాత్రం ఎంతో కూల్ అండ్ కామ్ గా కనిపించింది. నోట్లో వేలుపెట్టిన కొరకలేదేమో అనేంత అమాయకంగా కనిపించింది వాసంతి.
కానీ ఇప్పుడు బోల్డ్ సీన్స్ లో నటించి అందరికీ ట్విస్ట్ ఇచ్చింది.. సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే గేమ్ ఆన్ సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఇందులో రొమాన్స్ తో రెచ్చిపోయింది వాసంతి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా టీజర్ మొత్తానికి హీరో కన్నా హీరోయిన్ బోల్డ్ రొమాన్స్ హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి.. విశ్వక్సేన్ స్నేహితుడు గీతానంద్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అయితే అమాయకంగా కనిపించిన వాసంతిని ఇలాంటి బోల్డ్ సీన్స్ లో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.