ఆ క్రికెటర్ పై.. నిషేధాన్ని తగ్గించిన బీసీసీఐ?

praveen
సాధారణంగా బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో ఎంత ఖచ్చితత్వం తో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆటగాళ్లకు వేతనాలను ఎక్కువ మొత్తంలో చెల్లించడం విషయంలో అంతేకాకుండా సరైన సదుపాయాలు ఇవ్వడం విషయంలో ఎలా అయితే కచ్చితత్వంతో  ఉంటుందో ఇక నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడం విషయంలో కూడా అంతే కచ్చితంగా ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ఫిక్సింగ్కు పాల్పడ్డారు అన్న విషయం బయటకు వచ్చిందంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది బీసీసీఐ.

 ఫిక్సింగ్ కి పాల్పడిన ఆటగాళ్లు ఇక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా బీసీసీఐ వారి విషయం లో మాత్రం వెనకడుగు వేయదు అని చెప్పాలి. గతంలో 2013 ఐపీఎల్ సీజన్ సమయం లో కూడా ఇలా స్పాట్ ఫిక్సింగ్ కలకలం సృష్టించింది అని చెప్పాలి. అయితే ఈ స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యం లో ముగ్గురు క్రికెటర్ల పై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే భారత ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడటంపై అటు బీసీసీఐ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడిన వారిలో భారత జట్టు లో కీలక బౌలర్గా కొనసాగుతున్న శ్రీశాంత్ కూడా ఉండడం గమనార్హం. అయినప్పటికీ అతని విషయం లో నిర్మొహమాటం గా వ్యవహరించిన బీసీసీఐ జీవిత కాల నీషేదాన్ని విధించింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు సూచన తో అతనిపై నిషేధాన్ని తగ్గించింది. అయితే అతనితో పాటు అంకిత్ చావాన్,  చందిల కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడగా.. వీరిపై కూడా జీవిత కాలం నిషేధం కొనసాగింది. అయితే ఇక ఇటీవల జీవిత కాలం నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తున్నట్లు బీసీసీఐ అంబడ్స్ మన్ వినీత్ సరన్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: