భరత్ ఏంటిది.. ఇలా అయితే జట్టు నుంచి పీకేస్తారు?

praveen
ఎన్నో రోజుల నుంచి టీమిండియాలో  అవకాశంలో ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లు ఇక ఛాన్స్ వచ్చిందంటే చాలు సత్తా ఏంటో నిరూపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలా జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు ఇక తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఎన్నో రోజులుగా భారత జట్టులో చోటు కోసం ఎదురు చూశాడు తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్. ఇక ఇటీవలే అతనికి అదృష్టం వరించింది. ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు. దీంతో తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా అతను బాగా రాణించాలని ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.

 ఈ క్రమంలోనే టీమిండియా ఆడుతున్న మ్యాచ్లలో కీపర్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.  అయితే కీపర్ గా తన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ పర్వాలేదు అనిపిస్తూ ఉన్నప్పటికీ... బ్యాట్స్మెన్ గా మాత్రం పూర్తిగా విఫలం అవుతూ ఉన్నాడు. ఎక్కడ ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు. తొలి టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో  భరత్ విఫలమయ్యాడు. దీంతో మొదటి మ్యాచ్ కదా ఒత్తిడికి గురై ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక రెండవ మ్యాచ్ లో కూడా అదే బ్యాటింగ్ తీరును కనబరిచాడు.

 జడేజా అవుట్ అయిన సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన కేఎస్ భరత్ విరాట్ కోహ్లీతో కలిసి మంచి ఇన్నింగ్స్ నిర్మిస్తాడని అందరూ అనుకున్నారు. ఇక అతన్ని ప్రోత్సాహించడానికి తెలుగు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మైదానంలో ఫ్లకార్డులు పట్టుకొని ఉత్సాహపరిచారు. అయినప్పటికీ భరత్ అందరిని నిరాశపరిచాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి లియాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. స్వీప్ షాట్ ఆడెందుకు ప్రయత్నించి.. చివరికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు అని చెప్పాలి. దీంతో భరత్ ప్రదర్శన పై ఎంతో మంది పెదవి వివరిస్తున్నారు. ఇలా అయితే జట్టులో ఉండడం కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: