ఆస్ట్రేలియా మళ్ళీ పాత "కథే"... 263 కే ఆల్ అవుట్ !

VAMSI
ఈ రోజు నుండి ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన రెండవ టెస్ట్ జరుగుతూ ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ లో ఓడిపోయి సిరీస్ లో 0-1 తో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గెలుపు కంగారూలకు చాలా అవసరం. అలా గెలుపే లక్ష్యంగా మొదలు పెట్టిన ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీం లో కూడా రెండు కీలక మార్పులు చేసింది. అయితే గత టెస్ట్ లాగా కాకుండా ఇందులో మాత్రం ఆస్ట్రేలియా కొంచెం మెరుగ్గానే ఆడిందని చెప్పాలి. గత మ్యాచ్ లో లాగే ఇందులో కూడా డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ విఫలం అయ్యాడు. మరో ఓపెనర్ ఖవాజా మాత్రం ఆచితూచి ఆడుతూ అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం బెదరక తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. చివరికి ఖవాజా 81 పరుగుల వద్ద ఉండగా జడేజా బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు. పీటర్ హాండ్స్ కాంబ్ మరియు కమిన్స్ లు కాసేపు ఇండియా బౌలర్లను ప్రతిఘటించారు. వీరిద్దరి జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో జడేజా మరోసారి మాయ చేశాడు... ఒక్క ఓవర్ లోనే కమిన్స్ (33) మరియు మర్సీ లను అవుట్ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. అలా ఆస్ట్రేలియా మరో ఓవర్ల ఆట మిగిలి ఉండగానే 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో వార్నర్ 15, ఖవాజా 81, లాబుచెన్ 18, స్టీవెన్ స్మిత్ 0, హెడ్  12, క్యారీ 0, కమిన్స్ 33 , మర్పి 0, లయన్ 10 మరియు కునేమాన్ లు పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఒక్క హాండ్స్ కాంబ్ మాత్రమే ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇండియా బౌలర్లలో షమీ 4, అశ్విన్ మరియు జడేజాలు చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. మరి ఇండియా మొదటిరోజున వికెట్ కోల్పోకుండా ముగిస్తుందా చూడాలి.  
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: