పంత్ చెంప పగలగొట్టాలని ఉంది : కపిల్ దేవ్

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఉత్తరాఖండ్లో ఉన్న తన తల్లిని కలిసేందుకు  వెళ్తుండగా తెల్లవారుజామున అతని కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది అని చెప్పాలి. ఎంతో చాకలిచక్కంగా కారులో నుంచి దూకేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు అన్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ బిఎండబ్ల్యూ కారు అక్కడికక్కడే కాళీ బూడిద కాగా రిషబ్ పంత్ కు ఇక తీవ్ర గాయాలు అయ్యాయి.

 ఈ క్రమంలోనే ఇక అతను ఇప్పుడిప్పుడే గాయాలనుంచి కోలుకుంటున్నాడు అని చెప్పాలి. అతని మోకాలికి సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయింది. మొన్నటి వరకు ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న డిశ్చార్జి అయ్యాడు. అతను త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. కాగా ఇక తీవ్ర గాయాలు పాలైన నేపథ్యంలో అతను దాదాపు సంవత్సరం పాటు క్రికెట్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా అతను లేకుండానే కీలకమైన సిరీస్ లు ఆడబోతుంది.

 అయితే రిషబ్ పంత్ గాయపడిన సమయంలో స్పందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెటర్లు కాస్త జాగ్రత్త తీసుకోవాలని.. పర్సనల్ డైవర్ ని ఏర్పాటు చేసుకోవాలంటు సలహా ఇచ్చాడు. ఇటీవలే మరోసారి స్పందిస్తూ  ఏకంగా రిషబ్ పంత్ చెంప పగలగొట్టాలని ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షించిన కపిల్ దేవ్.. అతడిని చెంప దెబ్బ కొట్టాలని ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. పంత్ టీమిండియాలో లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అందుకే మరోసారి ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి.. చెంప దెబ్బ కొట్టాలని ఉంది. పంత్ అంటే ఇష్టమే. కానీ ఈ తరం క్రికెటర్లు ఎందుకు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారో అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: