వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ మధ్య.. ఎన్నో పోలికలున్నాయి : పూజారా

praveen
వీరేంద్ర సెహ్వాగ్.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అతని బ్యాటింగ్ లో ఆ రేంజ్ లో విధ్వంసం ఉంటుంది అని చెప్పాలి. మైదానంలోకి వచ్చి సిక్సర్లు ఫోర్ లతో  విరుచుకుపడి స్కోరుబోర్డును సైతం అలసిపోయేలా చేయగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్అని చెప్పాలి.  అతని దూకుడు ముందు ప్రత్యర్థి బౌలర్ల సైతం భయపడిపోతూ ఉంటారు. అంతేకాదు ఇక క్రీజులోకి వచ్చిన మొదటి బంతిని ఇక స్టాండ్స్ లోకి తరలించగల సత్తా కలిగిన బ్యాట్స్మెన్.. వీరేంద్ర సెహ్వాగ్ అనే చెప్పాలి. అయితే ఇక వీరేంద్ర సెహ్వాగ్ లాగా ప్రస్తుతం భారత జట్టులో కేవలం కొంతమంది ఆటగాళ్లు మాత్రమే దూకుడుగా ఆడగలుగుతున్నారు.

 ఇలా దూకుడు అయిన బ్యాటింగ్ తో ప్రేక్షకులను మైమరిపిస్తున్న  వారిలో రిషబ్ పంత్ కూడా ఒకరు అని చెప్పాలి.  ఇక వీరేంద్ర సెహ్వాగ్ లాగానే అటు రిషబ్ పంత్ కు కూడా ఆస్ట్రేలియా పై మంచి రికార్డు ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే.. ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ తో ఇక ఇప్పుడు రిషబ్ పంత్తో కూడా కలిసి ఆడిన  పూజార ఇక ఇటీవల వీరిద్దరి మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్  లాగానే  పంత్ కూడా తన సహజమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడతాడు అంటూ అభిప్రాయపడ్డాడు.

 ఈ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  పరిమిత ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడుతూ షాట్లు ఆడుతున్నారు. టెస్ట్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి సహజమైన ఆటతీరుతో అప్పుడప్పుడు అటాకింగ్ గేమ్ ఆడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ ఆట తీరును చూస్తే  వారిద్దరి మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. నేను వారిద్దరిని పోల్చాలని అనుకోవట్లేదు. కానీ టెస్ట్ క్రికెట్లో వారి ఆట తీరు ఇక ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు దూకుడైన ఆటగాళ్ళే. వారి సామర్థ్యాలపై ఎంతో నమ్మకం కలిగిన వారు అంటూ పూజార చెప్పుకొచ్చాడు. కాగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే బోర్డర్ గవాస్కర్  ట్రోపీలో పూజార కూడా భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: