ప్రపంచ రికార్డు బ్రేక్.. రషీద్ ఖాన్ కి షాక్?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో స్టార్ బౌలర్లుగా కొనసాగుతున్న వారు వికెట్లు తీయడంలో ఇతర బౌలర్లతో పోటీ పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నువ్వా నేను అన్నట్లుగానే బంతితో చెలరేగిపోతూ వికెట్లు పడగొడుతూ ఎన్నో ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఇటీవలే కాలంలో ఇక ఎంతోమంది ప్లేయర్లు ప్రపంచ రికార్డులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు దేశీయ లీగ్ లలో కూడా బాగా రాణిస్తున్న ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరుస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా ఫేసెర్ అండ్రూ టై సైతం ఇటీవల ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. ఇక అందరినీ వెనక్కి నెట్టి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు. అది కూడా అదే తక్కువ మ్యాచ్ లలోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఈ రికార్డు సాధించిన ఆండ్రూ టై ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఆడుతూ ఉన్నాడు. పెర్త్ స్కార్చర్ తరపున ఆడుతున్నాడు.  ఈ క్రమంలోనే ఇటీవలే బ్రిస్బెన్ హీట్ తో జరిగిన మ్యాచ్లో జేమ్స్ బేస్లే వికెట్ పడగొట్టి.. ఇక ఈ అరుదైన రికార్డ్ సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు ఆండ్రూ టై. 211 మ్యాచ్లలోనే అండ్రూ టై 300 వికెట్ల మార్కును అందుకోవడం గమనార్హం. అయితే గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ ఖాన్ 213 మ్యాచ్లలో 300 వికెట్ల మార్కును అందుకోగా ఇప్పుడు అండ్రూ టై ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: