ఆసియా కప్ వేదిక మార్పు.. ఎక్కడికో తెలుసా?

praveen
2023 ఏడాదిలో రెండు మెగా టోర్నీలు జరగబోతున్నాయి అని చెప్పాలి. ఒకటి భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ అయితే మరొకటి పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఆసియా కప్ కావడం గమనార్హం.  అయితే ఇలా రెండు దాయాది దేశాలలో రెండు మెగా టోర్నీలు జరగాల్సి ఉండడమే ప్రస్తుతం పెద్ద చర్చకు కారణమైంది అని చెప్పాలి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ దేశాల మధ్య ఇక ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగడం లేదు అని చెప్పాలి.

 కేవలం మెగా టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలబడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక భారత్లో ఉన్న వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ ఇక ఇండియాలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇక పాకిస్తాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్తాన్లో అడుగుపెడుతుందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహిస్తేనే తాము టోర్నీలో పాల్గొంటామని లేదంటే తప్పుకుంటాము అంటూ ఇప్పటికే బీసీసీఐ నుంచి ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెటర్లు కూడా బీసీసీఐపై విమర్శలు చేస్తూ ఉన్నారు.

 అయితే ఆసియా కప్ వేదిక మారుస్తారా లేదా అన్న చర్చ మాత్రం జరుగుతూనే ఉంది అని చెప్పాలి. అయితే ఆసియా కప్ టోర్నీ వేదికను పాకిస్తాన్ నుంచి మరో ప్రాంతానికి మార్చడంపై ఏషియన్ క్రికెట్ కౌన్సిల్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం. ఇందుకోసం బీసీసీ కార్యదర్శి జైశా కూడా బెహరేయిన్ చేరుకున్నారట. ఇక పాక్ ఆతిథ్యంలోనే యూఏఈ లేదా శ్రీలంకకు వేదికను మార్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అని సమాచారం. ఇక ఏం జరగబోతుందో అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: