బ్యాటింగ్ లోనే కాదు.. ఫీల్డింగ్ లోను సూర్య మిస్టర్ 360నే?

praveen
మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్లో 360 ప్లేయర్ ఆటగాడు అనగానే ప్రతి ఒక్కరికి అటు ఎబి డివిలియర్స్ గుర్తుకు వచ్చేవాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు అతను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని ఆటను మరిపించేలా కొత్త 360 ప్లేయర్గా అవతరించాడు టీమిండియా ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అతను సృష్టిస్తున్న విధ్వంసం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇప్పటికే ఎంతోమంది క్రికెటర్లు పొట్టి ఫార్మాట్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించగా.. ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో ఇక టి20 ఫార్మాట్ ను కొత్త పుంతలు తొక్కిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఎంత పటిష్టమైన ప్రత్యర్థి అయినా సరే అతని బ్యాటింగ్ విధ్వంసానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది.

 వెరసి సూర్య కుమార్ యాదవ్ క్రీజులో ఉన్నాడు అంటే చాలు ఇక అతనికి బౌలింగ్ చేయడానికి అటు ప్రత్యర్థి బౌలర్లు అందరూ కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి. ఇలా తన వీరోచితమైన ఇన్నింగ్స్ లతో ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీస్ బ్యాటింగ్ కి ఎవరు సాటి లేరు అని ఎంతోమంది అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కేవలం బ్యాటింగ్ లోనే కాదు అటు ఫీల్డింగ్ లో కూడా సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ప్లేయర్ అన్నది తెలుస్తుంది.


 న్యూజిలాండ్తో ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భాగంగా సూర్య కుమార్ ఫీల్డింగ్ లో కూడా 360 డిగ్రీస్ టాలెంట్ చూపించాడు. స్లిప్పులో ఫీల్డింగ్  చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఏకంగా రెండు అదిరిపోయే క్యాచులను పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోతున్నాయి. తొలి ఓవర్లో ఫిన్ అలెన్, మూడో ఓవర్లో గ్లెన్ పిలిప్స్ క్యాచ్ ఒకేలా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఈ వీడియోలు వైరల్ గా మారగా.. ఇది చూసిన అభిమానులు కేవలం బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను మిస్టర్ 360 అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: