వైరల్ : సిక్సర్లతో విరుచుకుపడుతున్న ధోని?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కోసం అటు అభిమానులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధోని అభిమానులు అయితే 1000కళ్లతో నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక ధోని ఆటను చూడాలి అంటే ప్రతి అభిమాని కూడా ఐపీఎల్ సీజన్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలి. అయితే గత ఏడాది జట్టు సరిగ్గా ఆడకపోయినప్పటికీ మహేంద్రసింగ్ ధోని మాత్రం బ్యాటింగ్ లో మంచి టచ్ లో కనిపించాడు.

 సొగసైన షాట్లతో ఒకప్పటి మహేంద్ర ధోనిని తలపించాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు 2023 ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ  చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మాత్రమే ఇప్పటినుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు అనేది తెలుస్తుంది. కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్న ధోని ఇక తన జట్టుకు ఈసారి టైటిల్ అందించడమే లక్ష్యంగా బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ధోని నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి.

 ఇక ఇప్పుడు ధోని నెట్ ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. స్పిన్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తున్న ధోని ఇక భారీ సిక్సర్లు బాదుతూ ఉండడం ఈ వీడియోలో కనిపిస్తుంది అని చెప్పాలి. ధోని సిక్సర్లకు మైదానం దద్దరిల్లుతుంది. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి తలైవా ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు. అయితే రాంచి వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లను ధోని కలిసి ముచ్చటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: