ప్చ్... ఆ ఒక్క ఓవర్... ఇండియా ఓటమిని శాసించింది !

VAMSI
నిన్న రాత్రి ఝార్ఖండ్ లోని రాంచి వేదికగా ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన మొదటి టీ 20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ హర్ధిక్ పాండ్య చేజింగ్ చేయడానికి మొగ్గు చూపించి కివీస్ కు బ్యాటింగ్ అప్పగించాడు. కివీస్ ఆటగాళ్ళు ఆరంభం నుండి ఎదురుదాడి వారి సూత్రంగా ఆడారు. ఫలితంగా ఒక దశలో 10 కి పైగా రన్ రేట్ తో ప్రమాదకరంగా మారుతున్న దశలో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి ఇండియా శిబిరంలో ఆశలు నింపాడు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. ఆ తర్వాత స్కోర్ బోర్డ్ లో వేగంగా మందగించినా 8 కు తగ్గకుండా పరుగులు చేస్తూ వచ్చారు.
ఇక మధ్య ఓవర్ లలో చాలా బాగా కంట్రోల్ చేసిన ఇండియా బౌలర్లు ఆఖరి ఓవర్ లో మాత్రం పూర్తిగా అదుపు తప్పి బౌలింగ్ చేశాడు యంగ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్.. 19 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ స్కోర్ 149 పరుగులు మాత్రమే ఉంది. కనీసం 20 వ ఓవర్ లో మరో 10 పరుగులు చేసినా 160 దగ్గరకు వస్తుంది. ఇండియా కు చేజింగ్ చేయడం కొంచెం సులభం అవుతుంది అనుకున్నారు అభిమానులు. క్రీజులో అప్పటికే ఫామ్ లో ఉన్న డారిల్ మిచెల్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. కానీ ఆర్ష్ దీప్ సింగ్ కు ఏమైందో ఏమో మొదటి బంతిని నో బాల్ వేయడంతో పాటు సిక్సర్ ఇచ్చాడు, నో బాల్ కు ఫ్రీ హిట్ కావడంతో మళ్లీ సిక్సర్ బాదాడు.. మళ్లీ మరో సిక్సర్ ఇచ్చాడు... చాలా పూర్ బౌలింగ్ తో స్లాట్ బాల్స్ వేస్తూ పరుగులు ఇచ్చాడు అర్శ్ దీప్ సింగ్.
అలా ఆఖరి ఓవర్ లో డారీల్ మిచెల్ మొత్తం 27 పరుగులు పిండుకున్నాడు. అలా కివీస్ నిర్ణీత ఓవర్ లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ లో అర్ష్ దీప్ సింగ్ బౌలింగే ఇండియా ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం అయింది. ఆ తర్వాత ఇండియా ఆటగాళ్ళు ఈ పరుగులను చేదించడంలో పూర్తిగా తడబడ్డారు. మొదటి పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖరికి 155 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో మొదటి టీ 20 లో ఘోరంగా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: