ఇది కదా గుడ్ న్యూస్.. మనోడు వరల్డ్ నెంబర్.1 అయ్యాడు?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా తరఫున వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న మహమ్మద్  సిరాజ్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు జట్టులో కీలకమైన బౌలర్గా  ఉన్న బుమ్రా గాయం బారిన పడి గత కొన్ని నెలల నుంచి టీమిండియా కు దూరంగానే ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న సిరాజ్  బుమ్రా స్థానాన్ని స్థానాన్ని భర్తీ చేస్తూ ఉన్నాడు. కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ తన ఫేస్ బౌలింగ్ తో నిప్పులు చెరుగుతూ వున్నాడు అని చెప్పాలి.

 ఒకప్పుడు టీమ్ ఇండియాలో అతను పనికిరాడు అన్నవాళ్లే ఇక ఇప్పుడు తన బౌలింగ్ పై ప్రశంసలు కురిపించేలా చేసుకుంటున్నాడు మహమ్మద్ సిరాజ్. ఇలా ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు. అయితే ఒక సాదాసీదా ఆటో వాళ కొడుకుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టి అదృష్టం కలిసి వచ్చి ఐపీఎల్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. అటు నుంచి ఇక టీమ్ ఇండియాలోకి వచ్చి అదరగొట్టాడు.  కానీ కొంతకాలానికే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు.

 అయినప్పటికీ పట్టు విడువని  విక్రమార్కుడిలా తనని తాను ఎప్పుడూ కొత్తగా నిరూపించుకుంటూ వస్తున్న మహమ్మద్ సిరాజ్.. ఇక ఇప్పుడు టీమిండియాలో కీలక బౌలర్ గా మారిపోయాడు. అంతే కాదండోయ్ మన హైదరాబాద్ బౌలర్ కాస్త ఇక ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ గా మారిపోయాడు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో ట్రెంట్ బౌల్టు, హేసిల్ వుడ్ లాంటి స్టార్ ప్లేయర్లను సైతం వెనక్కి నెట్టి  హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. 729 పాయింట్లతో ఇలా నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 727 రేటింగ్ పాయింట్లతో హే జిల్ వుడ్, 708 రేటింగ్ పాయింట్లతో బౌల్ట్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. దిన దినాభివృద్ధి చెందుతూ ఆటలో పట్టు సాధిస్తూ ఇక ఇప్పుడు మన హైదరాబాద్ బౌలర్  ప్రపంచ నెంబర్ వన్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: