టీమిండియాను చూసి.. పాక్ నేర్చుకోవాలి : రమిజ్ రజా

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టు సొంతగడ్డ పైన వరుస ఓటమిలు చవిచూస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. విదేశీ జట్లు పాకిస్తాన్ పర్యటనకు వచ్చి ఇక పాక్ జట్టును చిత్తుగా ఓడించి సిరీస్ కైవసం చేసుకుని వెళ్ళిపోతున్నాయి. దీంతో ఇక పాకిస్తాన్ ఆటగాళ్లను ఉద్దేశించి ఫాన్స్ ట్రోల్లింగ్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక భారత జట్టు మాత్రం స్వదేశంలో వరసగా సిరీస్ లు గెలుస్తూ ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి.

 ముఖ్యంగా భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లను చిత్తుగా ఓడిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. ఇక ఇప్పటికే కొత్త ఏడాదిలో శ్రీలంక పై రెండు సీరిస్లను గెలుచుకున్న టీమిండియా ఇక ఇటీవల న్యూజిలాండ్తో సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. అయితే మొన్నటి వరకు టీమిండియా పై తీవ్ర స్థాయిల విమర్శలు గుర్తించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు రిమీజ్ రాజా ఇటీవల టీమ్ ఇండియా ప్రదర్శన పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు. సొంత గడ్డపై టీమిండియాని ఓడించడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించాడు.

 అయితే స్వదేశంలో క్రికెట్ ఎలా ఆడాలి అనేది ఉపఖండ జట్లు ముఖ్యంగా పాకిస్తాన్ భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు. భారత జట్టుతో పోల్చి చూస్తే సొంత గడ్డపై పాకిస్తాన్ ప్రదర్శన నిలకడగా లేదు. స్వదేశంలో పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం భారత్కు ఎంతగానో కలిసి వచ్చింది అంటూ రిమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ముందర ఆ జట్టుకు ముఖ్యమైన మైలురాయి అంటూ రిమీజ్ రాజు అన్నాడు. ఇక పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అని చెప్పాలి. స్వదేశంలో  పరిస్థితులను ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవాలో భారత్ను చూసి పాకిస్తాన్ నేర్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: