సూర్య కుమార్.. ఇంకా దానికి అలవాటు పడాలి?

praveen
ప్రపంచ క్రికెట్లో పొట్టి ఫార్మాట్ గా పిలుచుకునే టి20 క్రికెట్లో అటు సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన ప్రదర్శనతో ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి. అయితే ఇలా టి20 ఫార్మాట్ లో అసమాన్యమైన ప్రదర్శన చేస్తున్న సూర్య కుమార్ యాదవ్.. ఇక మరో పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డే ఫార్మాట్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు అని చెప్పాలి.

 టి20 ఫార్మాట్లో లాగా వన్డే ఫార్మాట్లో తన విధ్వంసాన్ని కొనసాగించలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మంచి ఆరంభాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇక వాటిని భారీ స్కోరుగా మలచడంలో మాత్రం సూర్య కుమార్ యాదవ్ విఫలం అవుతున్నాడు. అయితే ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా 31 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్లో ఇమాడగలడా లేదా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇక ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందించాడు. సూర్య కుమార్ వన్డే ఫార్మాట్ కు అలవాటు పడటానికి కొన్నాళ్ల సమయం పడుతుంది. అంటూ చెప్పుకొచ్చాడు.

 సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు. అతడు టి20 ఫార్మాట్లోనే ఎక్కువగా మ్యాచ్లు ఆడాడు   అయితే పొట్టి ఫార్మాట్లో ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు రాబట్టడానికి అతడు ప్రయత్నిస్తాడు. కానీ వన్డే ఫార్మాట్లో మ్యాచ్ లో సమయం ఉంటుంది ఇక ఈ విషయం సూర్య కుమార్కు అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ లో మిలియన్ డాలర్ ప్లేయర్ లాగా కనిపించినప్పటికీ ఎంతో సులభంగా వికెట్ చేజార్చుకున్నాడు. ఇక అతను వన్డే ఫార్మాట్ కి అలవాటు పడాలి అంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాలి. ఇక ఆటగాళ్లకు ఎక్కువ ఓవర్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ ఎక్కువ పరుగులు చేయలేకపోతున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు వసీం జాఫర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: