మొన్న రోనాల్డో.. ఇప్పుడు మెస్సి.. ఒకే దారిలో?

praveen
గత ఏడాది ఖాతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా తమ జట్టుకు వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో,  లియోనల్ మెస్సి పోరాడారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో రోనాల్డో కి నిరాశ ఎదురైతే అటు లియోనాల్ మెస్సి మాత్రం తన కెరియర్ చివర్లో ఇక తన జట్టుకు వరల్డ్ కప్ అందించి చిరకాల కలను నెరవేర్చుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ ఫుట్బాల్ ప్లేయర్లు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి.

 పోర్చుగల్ సారథి క్రిస్టియానో రోనాల్డో మాదిరిగానే ప్రస్తుతం అతని స్నేహితుడు లియోనల్ మెస్సి  సైతం నిర్ణయం తీసుకున్నాడు. సౌదీ లీగ్ లో ఒప్పందం కుదుర్చుకున్నాడు.  రోనాల్డో ఆల్ నజర్ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఆ జుట్టు తరఫున ఆడుతున్నందుకు 500 మిలియన్ యూరోలు ఒప్పందం  కుదురుచుకున్నాడు. అయితే భారత కరెన్సీలో 4400 కోట్లు కావడం గమనార్హం. ఇకపోతే ఇప్పుడు అతనికి సమవుజ్జి అయిన లియోనల్ మెస్సిని దక్కించుకునేందుకు సౌదీలోని రెండు ఫ్రాంచైజీలు   కన్నేసాయి అని తెలుస్తుంది. ఆల్ నజర్ కు  ప్రత్యర్ధులుగా ఉన్న ఆల్ ఇతిహాజ్, అల్ హిలాల్ కూడా మెస్సి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయట.

 ఇటీవల ప్రపంచ కప్ ముగిసిన వెంటనే యూఎస్ఏ ఛాంపియన్స్ లీగ్ లో తన ఫ్రాంచేసి అయిన పిఎస్జి తరఫున ఆడుతున్నాడు మెస్సి. ఈ ఫ్రాంచైజితో అతని ఒప్పందం వేసవి వరకు మాత్రమే ఉంది అని చెప్పాలి. అయితే మెస్సి దానిని ఇంకా రెన్యువల్ చేసుకోలేదు.దీంతో అతను సౌదీ లీగ్ లో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సౌదీ లీగ్ లో ఉన్న ఫ్రాంచైజిలు రెండు కూడా అతనితో చర్చలు మొదలుపెట్టాయట. ఇక అతని కోసం 300 మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో 3000 కోట్ల రూపాయలు అయినా చెల్లించడానికి రెండు ఫ్రాంచైజీలు కూడా సుముఖంగానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: