సెలక్షన్ కమిటీపై.. రాబిన్ ఉత్తప్ప విమర్శలు?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరిస్తున్న తీరు కాస్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారత జట్టు ఎంపికైన ప్రతిసారి కూడా జట్టులోకి ఎవరు వస్తారు.. ఎవరు పోతారు అన్నదానిపై అందరికీ కన్ఫ్యూషన్  ఉంటుంది అని చెప్పాలి. ఒకప్పుడు మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు తప్పకుండా టీమిండియాలో సెలెక్ట్ అవుతారు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఒకవేళ మంచి ప్రదర్శన చేసిన టీమ్ ఇండియాలో స్థానం కొనసాగుతుంది అన్న గ్యారెంటీ లేకుండా పోయింది అని చెప్పాలి.

 ఏకంగా ఒక మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎక్కువ వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ప్లేయర్ ను మరో మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించిన ప్లేయర్ ను సైతం పక్కన పెట్టడం ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో చూసాము అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఇటీవల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాతో తలబడబోయే జట్టును ఎంపిక చేసిన క్రమంలో దేశవాళి క్రికెట్ లో బాగా రాణిస్తూ ఉన్న సర్పరాజ్ కాలనీ కనీసం జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు సెలెక్టర్లు. దీంతో ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 ఇక భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప సైతం ఇక ఈ విషయంపై స్పందిస్తూ భారత సెలక్టర్ల తీరును తప్పుపట్టాడు అని చెప్పాలి. గత డిసెంబర్లో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాన్ గా నిలిచిన కుల్దీప్ యాదవ్ను తర్వాత టెస్ట్ మ్యాచ్లలో ఇక జట్టు నుంచి పక్కన పెట్టి బెంచ్ కి పరిమితం చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటూ తెలిపాడు. బీసీసీఐ తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఆటగాళ్లకు మంచి సందేశాలు ఇవ్వబోవు అంటూ రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు. ఇలాంటివి చేయడం వల్లే అటు ఆటగాళ్లలో అభద్రతాభావం నెలకొంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు రాబిన్ ఉత్తప్ప..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: