ధోని ఫ్యాన్స్ అంటే.. ఆ మాత్రం ఉంటుంది మరి?

praveen
భారత క్రికెట్లో అటు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్లలో అటు ధోని మొదటి వరుసలో ఉంటాడు అని చెప్పాలి. ఒకప్పుడు భారత జట్టులో కొనసాగిన సమయంలో ఇక జట్టు కెప్టెన్గా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకంగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో రెండుసార్లు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్ గా కూడా ప్రస్థానాన్ని కొనసాగించాడు.

 అంతేకాదు తన మెరుపు వికెట్ కీపింగ్ తో కూడా దిగ్గజ వికెట్ కీపర్ గా ఎదిగాడు అని చెప్పాలి. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లతో పోల్చి చూస్తే ధోనికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ధోని క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శ్రీలంకతో నేడు మూడో వన్డే మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు.

 కేరళలోని తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఇక ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ సందర్భంగా ఆల్ కేరళ ధోని ఫ్యాన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం బయట 50 అడుగుల ధోని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. అక్కడ జరుగుతున్న మ్యాచ్ కి ధోని కి అసలు సంబంధమే లేకపోయినప్పటికీ ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు అని చెప్పాలి. ఈ కటౌట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ధోని మరో 50 కొట్టేశాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మూడో మ్యాచ్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: