వయసు 13 ఏళ్లు.. ఒకే ఒక్కడు.. 508 రన్స్ చేశాడు?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యువ సంచలనాలకు కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంటే క్రికెట్ ఊపిరిగా బ్రతుకుతున్న ఎంతోమంది కుర్రాళ్ళు దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ప్రదర్శనతో ఇక టీమిండియాకు ఫ్యూచర్ స్టార్స్ తామే అన్నవిషయాన్ని తమ ఆట తీరుతోనే నిరూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇక ఇప్పటివరకు క్రికెట్ ప్రేక్షకులు ఎవరూ కూడా కని విని ఎరుగని రీతిలో తమ ఆటతో విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఇక ప్రపంచ రికార్డులు కూడా కొల్లగొడుతున్నారు. ఇక ఇటీవల దేశ వాలి క్రికెట్లో 13 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్ విధ్వంసానికి ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మంత్రముగ్ధులు  అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ కలిసి 508 పరుగులు చేయడం గురించి ఇప్పటివరకు ఎన్నోసార్లు విన్నాము చూసాము కూడా. కానీ ఒకే ఒక్కడు ఏకంగా 508 పరుగులు చేయడం గురించి ఇప్పటివరకు దాదాపు ఎవరు విని ఉండరు అని చెప్పాలి.

 అంతేకాదు కేవలం 178 బంతుల్లోనే ఇక సదరు ఆటగాడు 508 పరుగులు చేశాడు అంటే అతని బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగింది అన్నది కూడా ఊహకిందని విధంగానే ఉంటుంది. కాగా నాగపూర్ కు చెందిన 13 ఏళ్ల కుర్రాడు యష్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలో ఇక ఇలాంటి రికార్డు సాధించాడు. 178 బంతుల్లో 81 ఫోర్లు 18 సిక్సర్లతో 508 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత్లో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. అతని బ్యాటింగ్ విధ్వంసంతో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సరస్వతి విద్యాలయ టీం 41 ఓవర్ లలో ఒక్క వికెట్ నష్టానికి 714 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు 5 ఓవర్లలో 9 పరుగులకే కుప్పకూలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: