నిప్పులు చెరిగిన పాక్ బౌలర్.. ప్రపంచ రికార్డ్?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న అన్ని టీంలు కూడా వరుసగా టెస్ట్ సిరీస్ లు ఆడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎంతోమంది ఆటగాళ్లు కూడా తమ అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఆడితే న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్లు కూడా డ్రాగా ముగిస్తాయి అని చెప్పాలి.

 ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఆతిధ్య పాకిస్తాన్తో వన్డే సిరీస్ లో ఆడుతుంది. రెండో వన్డే మ్యాచ్లో భాగంగా హోరాహోరీ పోరు జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ బౌలర్ నసీం షా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి 5 వన్డే మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి నసీం షా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. తన బౌలింగ్తో నిప్పులు జరుగుతూ ప్రత్యర్థులకు  వణుకు పుట్టిస్తూ ఉన్నాడు.

 గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా నసీం షా అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా 50 వన్ డే మ్యాచ్ లో కలిసి అతను 18 వికెట్లు పడగొట్టాడు. 2022 ఆగస్టు 16వ తేదీన నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక రెండో వన్డే మ్యాచ్లో రెండు వికెట్లు, మూడో వన్డే మ్యాచ్లు ఐదు వికెట్లు, నాలుగో వన్డే మ్యాచ్లో 5 వికెట్లు.. ఇక ఐదో వన్డే మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇలా తొలి వన్డే మ్యాచ్ లోనే 17 వికెట్లు తీసిన ర్యాన్ హారిస్ రికార్డును నసీం షా 18 వికెట్లతో బ్రేక్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: