నో బాల్స్ పై.. కోచ్ ద్రావిడ్ ఏమన్నాడో తెలుసా?

praveen
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో భాగంగా సత్తా చాటిన టీమిండియా జట్టు రెండో టి20 మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది అన్న విషయం తెలిసిందే. పేలవమైన ప్రదర్శనతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో కేవలం రెండు పరుగులు తేడాతో మాత్రమే విజయం సాధించిన టీమిండియా జట్టు రెండో టి20 మ్యాచ్లో మాత్రం శ్రీలంక చేతిలో ఏకంగా 16 పరుగుల తేడాతో ఓటమి చవిచూడటం గమనార్హం. ముఖ్యంగా రెండో టి20 మ్యాచ్ లో టీమిండియాలో ఉన్న కీలక బౌలర్లు చెత్త బౌలింగ్ తో నిరాశపరిచారు. అర్షదీప్ లాంటి యువ ఆటగాడు ఏకంగా ఐదు నోబాల్స్ వేసి అందరికీ చిరాకు తెప్పించాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఏ ఫార్మాట్లో అయినా సరే నో బాల్స్ మ్యాచ్ ను చేజార్చుతాయి అంటూ ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం నిరాశలో హార్దిక్ పాండ్యా కామెంట్లు చేయడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇలా రెండో టి20 మ్యాచ్ లో భారత బౌలర్లు నోబాల్స్ వేసి అటు ప్రత్యర్థులకు ఎక్స్ ట్రా రన్స్ కట్టబెట్టడం గురించి భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా కుర్ర బౌలర్లను వెనకేసుకొచ్చాడు అని చెప్పాలి.

 ఆటగాళ్లు ఎవరైనా సరే కావాలని నో బాల్స్ వేయరని.. ఇక కుర్రాళ్ళ మీద ఆవేశ పడవద్దు అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిమానులకు సూచించాడు అని చెప్పాలి. ముఖ్యంగా టి20 లో ఇప్పుడిప్పుడే యువ ఆటగాళ్లు ఎలా ఆడాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మెరుగవ్వడం అనేది కష్టమైన దశ. అందుకే అందరూ కాస్త ఓపికగా ఉండాలి అంటూ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. కాగా శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత బౌలర్లు దాదాపు 7 నో బాల్స్ వేశారు. ఇక ఇందులో అర్షదీప్ సింగ్ ఒక్కడే 5 నో బాల్స్ వేయడం గమనార్హం. అంతేకాదు ఏకంగా ఒక్క బంతి వేయడానికి హ్యాట్రిక్ నోబాల్స్ వేసి మూడు పరుగులు సమర్పించుకున్నాడు అర్షదీప్ సింగ్. ఆ తర్వాత శివమ్ మావి ఉమ్రాన్ మాలిక్ లు కూడా తలో ఒక నోబాల్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: