గిల్.. తప్పకుండా టీమిండియా కెప్టెన్ అవుతాడు : ఆకాష్ చోప్రా

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లలో అటు శుభమన్ గిల్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇప్పటికే భారత జట్టు తరుపున టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్ లో ఎన్నో మ్యాచ్లు ఆడిన శుభమాన్ గిల్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఇక మాజీ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు అని చెప్పాలి. ఇక అతనే ఫ్యూచర్ స్టార్ అంటూ మాజీ ఆటగాళ్లందరూ కూడా బల్ల గుద్ది చెప్పే విధంగా తన ఆట తీరుతో ప్రభావితం చేశాడు. అయితే ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టు తరఫున పొట్టి ఫార్మాట్లోకి కూడా అరంగేట్రం చేసాడు.

 అయితే ఇప్పటికే వన్డే టెస్ట్ ఫార్మట్ లలో మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇక టి20 ఫార్మాట్లో కూడా అతనికి తిరుగు ఉండదు అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో శ్రీలంకతో రెండు టి20 మ్యాచ్లలో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కె పెవిలియన్ చేరి ఇక నిరాశపరిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శుభమన్ గిల్ ప్రదర్శన పై విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. శుభమన్ గిల్ టి20 ఫార్మాట్ కి అస్సలు పనికిరాడు అంటూ వ్యాఖ్యానించాడు. కేవలం టెస్టులు వన్డే ఫార్మాట్ కి మాత్రం అతని ఆట తీరు సరిపోతుందని అభిప్రాయపడ్డాడు.

 ఇక నా అభిప్రాయం ప్రకారమైతే శుభమన్ గిల్ ఎప్పటికి లాంగ్ ఫార్మాట్ ఆడే ఆటగాడు.. ఎందుకంటే అతడు ఆడే విధానం టి20 క్రికెట్కు సెట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే టెస్టులు వన్డే క్రికెట్లో అతనిని అద్భుతమైన రికార్డు ఉంది. ఇక భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్లో అతను టీమిండియా కెప్టెన్ అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. అంతేకాదు అతనికి చాలా కాలం పాటు భారత జట్టు తరఫున వన్డే క్రికెట్ ఆడే సత్తా కూడా ఉంది.  కాబట్టి వన్డేలలో గిల్ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటూ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఇక అతను చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: